Friday, 12 August 2011

వరలక్ష్మీ వరప్రసాదం ... Mithunam Story in Bapu script

అందరికీ  వరలక్ష్మీ  శుక్రవారం శుభాకాంక్షలు !

పండుగ బాగా జరుపుకున్నారని అమ్మవారి దీవెనలు అందుకున్నారని తలుస్తాను...

నాకు మిగిలిన విషయాలు ఎలా వున్నా ఈ పండుగకి అమ్మవారు ఇచ్చిన బహుమతి " ఎన్నాళ్ళనుంచో ట్రై చేస్తున్న బాపు గారి హాండ్ స్క్రిప్ట్ లో వున్న శ్రీరమణ స్టోరీ మిథునం "...! అంతర్లీనం గా వున్న స్నేహ రాసిక్యత, భార్యాభర్తల మధ్య అనుబంధం ఇందులోని ప్రత్యేకతలు ... మరీ విశేషం ఏమంటే బాపు గారి హ్యాండ్ స్క్రిప్ట్ లో ఫుల్ స్టోరీ వుండడం. 

చాలా చేతులు  మారి ఇన్నాళ్ళకి దొరికింది.. మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని బ్లాగ్ లో పెడుతున్నాను ..enjoy by reading, share, enjoy by seeing others enjoy ! 



Tuesday, 9 August 2011

ఫ్రెండ్షిప్ డే సాక్షిగా బాల్యపుధూళి దులిపిన వేళ.....

అఫ్సర్ లాగ జ్ఞాపకాల్ని కవితలుగా మార్చే 'రసవిద్య'ఎమీ నా దగ్గర లేదు కానీ, పనుల వత్తిడిలో అలసి సొలసి సొమ్మసిల్లిన మనసుపొరల్లోంచి కొంచెం కొంచెంగా వెలుపలికి వచ్చిన పాతరోజుల  మదురిమలను కాగితమ్మీద కెలకడం మాత్రం నాకు తెలిసిన 'నస విద్య'. బాల్యపు ధూళి దులిపితే జారిన భావాల్ని అక్షరాలా, అక్షరశః మాత్రమే 'కెలికిన' దానికి నిలువెత్తు సాక్ష్యం (అడ్డంగా రాసేను కనుక అడ్డమెత్తు  సాక్ష్యం అనాలేమో)..ఈ ఇరవై పేజీల గందరగోళం.."బాల్యపుధూళి దులిపిన వేళ" .....నా ఆలోచనల్లాగే వుంది. ఎలా వుందో  చెప్పండి, లేదా తిట్టండి ఇక మీ మీ ఇష్టం ....నా ప్రాప్తం !ఇది నాకోసం నాలో నేను రాసుకున్న పిచ్చి రాతలు కనుక ఏమీ ఇబ్బంది  లేదు !  


Monday, 8 August 2011

శ్రీ రమణ story book "మిథునం" గురించి ..

మన  లాంటి  శ్రీరమణ  ఫాన్స్  ఎంత  మందో  !!!! 

Please see  http://pustakam.net/?p=7657&cpage= 1#comment-10887

And also : http://praseeda1.blogspot.com/search?u pdated-max=2011-06-11T23%3A31%3A00%2B05%3A30&m ax-results=4


Sunday, 7 August 2011

ఫ్రెండ్ షిప్ డే నాడు ఫ్రెండ్స్ కి బంగారు మురుగు !

తెలుగు వారికి శ్రీ రమణ ఒక బంగారు కానుక అయితే, 'బంగారు మురుగు' వారు మనందరికీ  ఇచ్చిన మరో గొప్ప వజ్రాల కానుక !
రండి ! చదవండి, ఆస్వాదించండి ..ఆనందించండి !
అమూల్యమైన   బంగారు మురుగు  స్వంతం చేసుకోండి  !