Saturday, 18 February 2012

పంచ మహాయజ్ఞాలు

మనము ప్రతీ రోజూ నిర్వహించవలసిన, సులభమైన + డబ్బు ఖర్చు లేని అయిదు యజ్ఞాలు- దేవ యజ్ఞము, పితృ యజ్ఞము, భూత యజ్ఞము, మనుష్య యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము అనే పంచ మహా యజ్ఞాల గురించీ, గర్భ వృద్ధి గురించీ  వివరించే బ్రహ్మశ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రిగారి "వేదార్థోపన్యాసములు" గ్రంథంలోని "పంచ మహాయజ్ఞాలు " అనే అధ్యాయము (పేజి 430 - 492).

Wednesday, 8 February 2012

ముళ్ళపూడి వారు 1963 లో రాసిన కథ "కానుక"

ముళ్ళపూడి వెంకట  రమణ  అనగానే  మనకి ముళ్ళపూడి + బాపు combination గుర్తు రావడం సహజం, ఆ పైన ముళ్ళపూడి వారి బుడుగు ఇతర హాస్య రచనలు మదిలో మెదిలి కితకితలు పెట్టడమూ అతి సహజం !

అలంటి ముళ్ళపూడి వారు 1963 లో రాసిన ఒక కథ  "కానుక" ఈ మధ్య బంధువులింట్లో ఒక కథా సంపుటిలో చూసేను.   చాలా నచ్చింది. బయటకు వెళ్లి xerox  తీయించడం కుదర లేదు. కబుర్లు చెబుతూనే కూర్చుని రాయడం (రాసుకోవడం)  మొదలు పెట్టేను.  పూర్తి అయ్యేసరికి   అర్థ రాత్రి అయ్యింది. 

ఇదిగో ఇక్కడుంది చిత్తగించండి.  అసలు ఇంత వైవిధ్యభరితం గా ముళ్ళపూడి మార్క్ లేకుండా రాయడం, మనల్ని అందులోకి లీనమైపోయేలా చెయ్యడం ఇందులోని విశేషం.

ప్రస్తుతానికి నా రాతలో భరించి చదివి, నచ్చితే ఒరిజినల్ దొరికితే చదువుకోండి.

ఇది నిజంగా తెలుగు వారికి ముళ్ళపూడి వారిచ్చిన ఒక గొప్ప కానుక !!!!

Hats off  again to  ముళ్ళపూడి !  

Monday, 6 February 2012

శ్రీరమణ గారి ‘మిథునం’

ఎన్ని సార్లు చెప్పినా, ఎన్ని సార్లు చదివినా తరగని, చెరగని ఆణిముత్యం శ్రీరమణ గారి కథ ‘మిథునం’ మళ్ళీ మరొక్క మారు చదివి ఆనందించండి ............!!!!!!!!!!!

Thursday, 26 January 2012

గాయత్రీ మంత్రార్ధము

సంధ్యావందనము, అందులోని మంత్రాల అర్థము తెలిపిన తర్వాత సంధ్యావందనము లోని ముఖ్య భాగమైన గాయత్రీ మంత్రార్ధమును,  దాని వెనుక పరమార్ధములను  వివరించే బ్రహ్మశ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రిగారి "వేదార్థోపన్యాసములు" గ్రంథంలోని  "గాయత్రీ మంత్రార్ధము" అనే అధ్యాయము (పేజి 356-429).

Wednesday, 25 January 2012

సంధ్యామంత్రార్ధము

నిత్య కర్మలలో ముఖ్యమైన సంధ్యావందనములోని మంత్రముల విశిష్టత వాటి అర్థములను, వాటి వెనుక పరమార్ధములను  వివరించే బ్రహ్మశ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రిగారి "వేదార్థోపన్యాసములు" గ్రంథంలోని సంధ్యామంత్రార్ధము  అనే అధ్యాయము (పేజి 292-355).

Tuesday, 24 January 2012

సంధ్యావందనము

నిత్య కర్మలలో ముఖ్యమైన సంధ్యావందనము, దాని విశిష్టత, సంధ్యావందనము ఒక కర్మా ? లేక ఉపాసనా ? అనే చర్చ, సంధ్యావందన కాలము, అర్ఘ్య ప్రదాన విశేషము  మొదలైన అనేక  విషయాలను వివరించే బ్రహ్మశ్రీ  రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రిగారి  "వేదార్థోపన్యాసములు" గ్రంథంలోని  సంధ్యావందనము  అనే అధ్యాయము  (పేజి 225-291).

Friday, 20 January 2012

భక్తి- దేవాలయములు


నిరాకారుడైన శివుడు, భక్తి-జ్ఞాన సాధనము, అర్చనకు ఆలంబనములు, ఆలయములు దేనికి, ఆలయమునకు గల అయిదు ప్రాకారములు, శివ ఏవ లింగం- శివ లింగం  మొదలగు అనేక  విషయాలను వివరించే బ్రహ్మశ్రీ  రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రిగారి  "వేదార్థోపన్యాసములు" గ్రంథంలోని భక్తి- దేవాలయములు అనే అధ్యాయము  (పేజి 637 - 680).

Friday, 6 January 2012

"ప్రాతః కాల విధి "

ప్రాతః కాలం అంటే ఉదయం పూట చెయ్యవలసిన విధులు, వాటి విధానాలు, భరత ఖండము-కర్మ భూమి, యజ్ఞము లోకమునకు నాభి, చాతుర్వర్ణ్యం, వర్ణం జన్మ సిద్ధం,కర్మలు మూడు రకాలు, కర్మలు చెయ్యడం కర్మలు మానెయ్యడానికే, నిత్యమైన కర్మ, అహింస మొదలైన విషయాలు తెలియచేసే   బ్రహ్మశ్రీ  రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి గారి "వేదార్థోపన్యాసములు" గ్రంథము లోని  "ప్రాతః కాల విధి "  అనే విషయాల  అధ్యాయము. (పేజి నెం. 101 -135). 



Wednesday, 14 December 2011

విలువైన వ్యక్తి - స్త్రీ (Viluvaina Vyakti Stree)

స్త్రీ యొక్క విలువ, స్త్రీ ని జాగ్రత్తగా ఒక సంపదగా చూడవలసిన అవసరాన్ని, అందులోని ఆవశ్యకతను తెలియజేసే బ్రహ్మశ్రీ  రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి గారి "వేదార్థోపన్యాసములు" గ్రంథము లోని "విలువైన వ్యక్తి - స్త్రీ", " గృహస్వామిని స్త్రీ " మరియు "సప్తపది" అనే విషయాల  అధ్యాయము. (పేజి నెం. 136 -159 ). 

Tuesday, 13 December 2011

10. గో మాహాత్మ్యము (GO MAAHAATYAMU)

    గోవు పుట్టుక,   గోదాన ప్రాస్త్యము,   గోపూజా ఫలము,   గోపయస్సు గొప్పతనము,   అగ్నికి గల ముగ్గురు సోదరులు,    గోవత్సము,  గో వర్ణనము,   పంచగవ్య ప్రాసన మొదలగు విషయాలను వివరించే బ్రహ్మశ్రీ  రే మెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి గారి  "వేదార్థోపన్యాసములు" గ్రంథంలోని గో మాహాత్మ్యము  (పేజి 569 -736 ).