స్త్రీ యొక్క విలువ, స్త్రీ ని జాగ్రత్తగా ఒక సంపదగా చూడవలసిన అవసరాన్ని, అందులోని ఆవశ్యకతను తెలియజేసే బ్రహ్మశ్రీ రేమెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి గారి "వేదార్థోపన్యాసములు" గ్రంథము లోని "విలువైన వ్యక్తి - స్త్రీ", " గృహస్వామిని స్త్రీ " మరియు "సప్తపది" అనే విషయాల అధ్యాయము. (పేజి నెం. 136 -159 ).
Wednesday, 14 December 2011
Tuesday, 13 December 2011
10. గో మాహాత్మ్యము (GO MAAHAATYAMU)
గోవు పుట్టుక, గోదాన ప్రాశస్త్యము, గోపూజా ఫలము, గోపయస్సు గొప్పతనము, అగ్నికి గల ముగ్గురు సోదరులు, గోవత్సము, గో వర్ణనము, పంచగవ్య ప్రాసన మొదలగు విషయాలను వివరించే బ్రహ్మశ్రీ రే మెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి గారి "వేదార్థోపన్యాసములు" గ్రంథంలోని గో మాహాత్మ్యము (పేజి 569 -736 ).
Monday, 12 December 2011
9. వివాహ సంస్కారం (VIVAAHA SAMSKAARAMU)
హిందూ వివాహం గురించి గల కొన్ని శంకలు, ద్రౌపదికి ఐదుగురు భర్తలా?, వివాహం ఎందుకు?, ధర్మపత్ని-కామ పత్ని, పెళ్లి చూపులు, కన్య యోగ్యతలు, పరీక్ష, గొప్ప దాత అల్లుడు, సప్తపది మొదలగు విషయాలను వివరించే బ్రహ్మశ్రీ రే మెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి గారి "వేదార్థోపన్యాసములు" గ్రంథంలోని వివాహ సంస్కారం (పేజి 499 -568).
"వేదార్థోపన్యాసములు" - బ్రహ్మశ్రీ రే మెళ్ళ సూర్య ప్రకాశ శాస్త్రి
Friday, 12 August 2011
వరలక్ష్మీ వరప్రసాదం ... Mithunam Story in Bapu script
అందరికీ వరలక్ష్మీ శుక్రవారం శుభాకాంక్షలు !
పండుగ బాగా జరుపుకున్నారని అమ్మవారి దీవెనలు అందుకున్నారని తలుస్తాను...
నాకు మిగిలిన విషయాలు ఎలా వున్నా ఈ పండుగకి అమ్మవారు ఇచ్చిన బహుమతి " ఎన్నాళ్ళనుంచో ట్రై చేస్తున్న బాపు గారి హాండ్ స్క్రిప్ట్ లో వున్న శ్రీరమణ స్టోరీ మిథునం "...! అంతర్లీనం గా వున్న స్నేహ రాసిక్యత, భార్యాభర్తల మధ్య అనుబంధం ఇందులోని ప్రత్యేకతలు ... మరీ విశేషం ఏమంటే బాపు గారి హ్యాండ్ స్క్రిప్ట్ లో ఫుల్ స్టోరీ వుండడం.
చాలా చేతులు మారి ఇన్నాళ్ళకి దొరికింది.. మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని బ్లాగ్ లో పెడుతున్నాను ..enjoy by reading, share, enjoy by seeing others enjoy !
Tuesday, 9 August 2011
ఫ్రెండ్షిప్ డే సాక్షిగా బాల్యపుధూళి దులిపిన వేళ.....
అఫ్సర్ లాగ జ్ఞాపకాల్ని కవితలుగా మార్చే 'రసవిద్య'ఎమీ నా దగ్గర లేదు కానీ, పనుల వత్తిడిలో అలసి సొలసి సొమ్మసిల్లిన మనసుపొరల్లోంచి కొంచెం కొంచెంగా వెలుపలికి వచ్చిన పాతరోజుల మదురిమలను కాగితమ్మీద కెలకడం మాత్రం నాకు తెలిసిన 'నస విద్య'. బాల్యపు ధూళి దులిపితే జారిన భావాల్ని అక్షరాలా, అక్షరశః మాత్రమే 'కెలికిన' దానికి నిలువెత్తు సాక్ష్యం (అడ్డంగా రాసేను కనుక అడ్డమెత్తు సాక్ష్యం అనాలేమో)..ఈ ఇరవై పేజీల గందరగోళం.."బాల్యపుధూళి దులిపిన వేళ" .....నా ఆలోచనల్లాగే వుంది. ఎలా వుందో చెప్పండి, లేదా తిట్టండి ఇక మీ మీ ఇష్టం ....నా ప్రాప్తం !ఇది నాకోసం నాలో నేను రాసుకున్న పిచ్చి రాతలు కనుక ఏమీ ఇబ్బంది లేదు !
Monday, 8 August 2011
శ్రీ రమణ story book "మిథునం" గురించి ..
మన లాంటి శ్రీరమణ ఫాన్స్ ఎంత మందో !!!!
Please see http://pustakam.net/?p=7657&cpage= 1#comment-10887
And also : http://praseeda1.blogspot.com/search?u pdated-max=2011-06-11T23%3A31%3A00%2B05%3A30&m ax-results=4
Please see http://pustakam.net/?p=7657&cpage= 1#comment-10887
And also : http://praseeda1.blogspot.com/search?u pdated-max=2011-06-11T23%3A31%3A00%2B05%3A30&m ax-results=4
Sunday, 7 August 2011
ఫ్రెండ్ షిప్ డే నాడు ఫ్రెండ్స్ కి బంగారు మురుగు !
తెలుగు వారికి శ్రీ రమణ ఒక బంగారు కానుక అయితే, 'బంగారు మురుగు' వారు మనందరికీ ఇచ్చిన మరో గొప్ప వజ్రాల కానుక !
రండి ! చదవండి, ఆస్వాదించండి ..ఆనందించండి !
అమూల్యమైన బంగారు మురుగు స్వంతం చేసుకోండి !
రండి ! చదవండి, ఆస్వాదించండి ..ఆనందించండి !
అమూల్యమైన బంగారు మురుగు స్వంతం చేసుకోండి !
Wednesday, 27 July 2011
వడ్డీ కాసుల వాని సేవలో వారాంతం (శేషాద్రి వాసుని సేవలో శనివారం + ఆనందనిలయుని సేవలో ఆదివారం)
Vamereekaa Yaatra
Hi,
This is a recount of our US & Canada yaatra 2010 !
eaxctly, an year back we started on this trip and are re-living our experiences.
thouht of sharing the experiences with all near & dear to me !
Though i had thsi idea earliuer, my friend's suggestion has preoplled me to make it real.
from today, April 21 to May 23rd i will be posting the PDF fiels of my handwritten script on the net.
todays file April 21 is
- Murthy Remilla
April 21, 2010
This is a recount of our US & Canada yaatra 2010 !
eaxctly, an year back we started on this trip and are re-living our experiences.
thouht of sharing the experiences with all near & dear to me !
Though i had thsi idea earliuer, my friend's suggestion has preoplled me to make it real.
from today, April 21 to May 23rd i will be posting the PDF fiels of my handwritten script on the net.
todays file April 21 is
- Murthy Remilla
April 21, 2010
Wednesday, 6 April 2011
అష్టావధానం ..ashtaavadhaanam
అష్టావధానం ఇతర భాషలలో కొంచెం వున్నా, తెలుగులోనే బాగా ప్రసిద్ధి పొంది ఇప్పుడు మన తెలుగు వాళ్ళకే పరిమితమైన ఒక అద్భుతమైన కళ ! తెలుగు తర్వాత ప్రాచుర్యం లో వున్నది ఒక్క సంస్కృతం లోనే !
చాలా పనులు ఒకేసారి చేసేవాళ్ళని చూసి మనం అష్టావధానం చేస్తున్నాడు అంటాము కానీ, అసలు అష్టావధానం అంటే ఎనిమిది సాహితీ పరమైన అంశాలతో కూడిన ఒక గొప్ప కళ... కళ కూడా కాదు... విద్య అనాలి. కళనీ కళాకారులనీ చిన్నబుచ్చడం నా ఉద్దేశం కాదు కానీ, అష్టావధానం కళ కంటే ఒక మెట్టు ఎక్కువ! అంటే " కొంచెం ఎక్కువ సమానం" అన్న మాట !
ఎంతో మేధస్సు, ప్రజ్ఞా పాటవం కావాలి అవధానం చెయ్యటానికి... ఇంకా ధారణా శక్తీ కూడా మెండుగా వుండాలి అవధానికి.
అష్టావధానంలో ఎనిమిది అంశాలు వుంటాయి.. వీటిని అడిగే వాళ్ళని పృచ్ఛకులు అంటారు.
ఈ ఎనిమిది అంశాలు: (1) నిషిద్ధాక్షరి (2) న్యస్తాక్షరి (3) దత్త పది (4) సమస్య (5) కావ్యగానం (6) వర్ణన (7) ఆశువు/పురాణం (8) అప్రస్తుత ప్రసంగం
ఒక్కోసారి వర్ణన, పురాణం, ఆశువులు మారుతూ వుంటాయి కానీ, మొత్తం మీద ఉండేవి ఎనిమిది ఒక్కసారి ఘంటా నాదం కూడా వుంటుంది.
ఇందులో చాల ప్రధానమైనవి సమస్య, నిషిద్ధాక్షరి, వ్యస్తాక్షరి, దత్తపది.
వీటిని ఛేదిస్తే ... అవధానాన్ని సాధించినట్లే! పృచ్ఛకులు అడిగిన వాటికి అవధాని చందోబద్ధ పద్య రూపంలో సమాధానాలు చెప్పాలి.
వీటిని ఛేదిస్తే ... అవధానాన్ని సాధించినట్లే! పృచ్ఛకులు అడిగిన వాటికి అవధాని చందోబద్ధ పద్య రూపంలో సమాధానాలు చెప్పాలి.
సమస్య: సమస్యలో కూడని/ పొసగని ఒక వాక్యాన్ని ఇస్తే, దానికి సరిపోయేలా (సరి చేసేలా) మిగిలిన మూడు పంక్తులు చెప్పాలి.
నిషిద్ధాక్షరి: ఈ పృచ్ఛకుడు ఏదో ఒక విషయం మీద పద్యం చెప్పమని అడుగుతాడు, కానీ ఏ ఏ అక్షరాలూ నిషిద్ధమో (వాడకూడదో) చెప్తూ ఉంటాడు. వాటిని వాడకుండా, భావం చెడ కుండా తను చెప్పదలచుకున్నది అర్థవంతంగా చెప్పాలి.
వ్యస్తాక్షరి: ఏదో ఒక వాక్యమో, పద్య భాగమో తీసుకుని అందులోని ఒక్కో అక్షరాన్ని క్రమం లేకుండా వీలైనంత గందర గోళం గా అప్పుడప్పుడు ఇస్తాడు పృచ్చకుడు. అవధాని ఇవన్నీ విని, గుర్తు పెట్టుకుని చివర్లో మొత్తం వాక్యాన్ని చెప్పగలగాలి. తమాషా ఏమంటే, పాత వాక్యాలే ఇవ్వక్కరలేదు... కల్పించి కూడా ఇవ్వవచ్చు ఊహించలేకుండా!
దత్తపది: పృచ్ఛకుడు ఇచ్చిన నాలుగు పదాలు వినియోగిస్తూ అడిగిన భావం వచ్చేలా పద్య పూరణం చెయ్యాలి.
ఇక మిగిలినవి- వర్ణన, ఆశువు, పురాణం.
పృచ్చకులు అడిగిన వాటిని వర్ణించడమో , అడిగిన భావానికి ఆశువుగా పద్యం చెప్పటమో, పురాణ/కావ్యాల లోంచి పృచ్ఛకుడు చెప్పిన పద్యానికి భావాన్ని, సందర్భాన్ని చెప్పడం చెయ్యాలి.
ఇక ఘంటానాదం, అప్రస్తుత ప్రసంగం గొప్ప సాహితీ రూపాలు కాదు కానీ, అవధానిగారి దృష్టి మళ్ళడానికి ప్రయత్నిస్తూ వున్నా, నిజానికి సభికులను రంజిల్ల చెయ్యడాని వుద్దేసింప బడినవి . అప్రస్తుత ప్రసంగం కాదు, నిజానికి అప్రస్తుత ప్రశంస!
అంటే అప్రస్తుత విషయాలని ఉటంకిస్తూ వుండడం అవధానిని సమాధానాలు
అడుగుతూ వుండడం. నేర్పు వుంటే, ఒక విధంగా అవధానికి, కూడా ఇది ఆట విడుపే!
అడుగుతూ వుండడం. నేర్పు వుంటే, ఒక విధంగా అవధానికి, కూడా ఇది ఆట విడుపే!
అవధానంలో ఇంకో గాన్మట్టైన విషయం ఏమంటే...
అవధాని సమాధానాలు తెలిసినా మొత్తం పద్యాలు ఒక్కసారి చెప్పకూడదు. నాలుగు ఆవృత్తులుగా విడగొట్టి ఒక్కో ఆవృత్తం పూర్తి చేసి, ఆయా ప్రుచ్చకుడికి చెప్పి... మళ్ళీ రెండో ఆవృత్తం లోకి వెళ్ళాలి.
ఇవన్నీ పూరణం- అంటే అప్పటికప్పుడు చెప్పడమయితే, అన్ని ఆవృత్తులూ పూర్తయ్యేక 'ధారణ' చేసి మళ్ళీ అన్నీ వరసగా చెప్పుకురావాలి . అంటే అప్పచెప్పడమన్న మాట!
ఇవీ, స్థూలంగా అష్టావధానం వివరాలు... అవధానాలలో ఇంకా రకాలు వున్నాయి - చిత్రావధానం (painting), నృత్యావధానం (Dancing) గణితావధనం (Mathematics) నేత్రావధానం (using the eyes) ....మొదలైనవి .
అష్టావధానం గురించి అయ్యింది కనుక... ఇక అసలు అష్టావధానం లోకి, సమస్యలూ పూరణల లోకి వద్దాము... తరువాయి "పంచిక" లో (పంచి పెట్టే సంచిక కి నేను పెట్టిన పేరు)!
ఇవ్వాళ్టికి సెలవా మరి?
మీ
- మూర్తి రేమిళ్ళ
తెలుగు తనం ఉట్టి పడిన శ్రీఖర ఉగాదితో ... స్వాగతం ! సుస్వాగతం !!
స్వాగతం ! సుస్వాగతం !!
నా మనసులో ఊహల్ని, మాటల్ని తెలుగులో... అచ్చ తెలుగులో మీతో పంచుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఈ ఉగాదికి మొదలయ్యింది...
దానికి వేదిక ..ఈ బ్లాగిక (బ్లాగ్ ఇక ) !!
దీని పేరు గల గలా గోదారి... అడ్రెస్ :http://murthyremilla.blogspot.com/
కోకిలమ్మల కూతలతో
మావికొమ్మల పూతలతో
వచ్చింది ఉగాది !
మీకు తెచ్చేందుకు
సంతోషాల నిధి !!
శ్రీ ఖర ఉగాది అందరికీ శ్రీ కరం కావాలని శుభాకాంక్షలు !!!
నాకు, నా లాంటి తెలుగు వాళ్ళందరికీ ఇది నిజంగా ఒక పండుగే !
ఒక రకంగా ఇది తెలుగు హ్యాట్రిక్ డే !
ఉదయం అన్ని ఛానెల్స్ లోనూ పంచాంగ శ్రవణం అయ్యేక..మొదలయ్యింది అసలు సిసలు తెలుగు పండుగ !
శ్రీ వెంకటేశ్వరా , ఇంకా భక్తి చానల్స్ లో అవధానాల పరంపరతో .. ఒక చోట శ్రీ మేడసాని మోహన్ , మరో రెండు చోట్ల శ్రీ గరికపాటి ...
ఈ రోజు అతిరథ నాయకుడు గా శ్రీ గరికపాటి నరసింహా రావు గారిని చెప్పుకోవచ్చు .
ఉగాది నాడు ఎలా వుంటే సంవత్సరం అంతా అలా వుంటుంది అన్న నమ్మకం నిజమైతే, ఇక ఈ సంవత్సరం అంతా సాహిత్య సౌరభాల వెల్లువ వస్తుందని ఆ జడి వానలో మనందరం తడిసి ముద్దవుతామని, ఆ ప్రకారం శ్రీఖరం సాహితీ శ్రీకరం అవుతుందనీ ఆశిద్దాము !
ఇవ్వాళ వుట్టి మీంచి పడిన తెలుగుతనం మరింతగా పదునెక్కి మన మనసుల్ని రంజింప చేస్తుందని తలుద్దాము !!
మరొక్క సారి మీకందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ..
(అష్ట్తవధానం విశేషాలు,పూరణలు రేపటి మాట లో ...)
మీ,
- మూర్తి రేమిళ్ళ
Subscribe to:
Posts (Atom)