స్వాగతం ! సుస్వాగతం !!
నా మనసులో ఊహల్ని, మాటల్ని తెలుగులో... అచ్చ తెలుగులో మీతో పంచుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఈ ఉగాదికి మొదలయ్యింది...
దానికి వేదిక ..ఈ బ్లాగిక (బ్లాగ్ ఇక ) !!
దీని పేరు గల గలా గోదారి... అడ్రెస్ :http://murthyremilla.blogspot.com/
కోకిలమ్మల కూతలతో
మావికొమ్మల పూతలతో
వచ్చింది ఉగాది !
మీకు తెచ్చేందుకు
సంతోషాల నిధి !!
శ్రీ ఖర ఉగాది అందరికీ శ్రీ కరం కావాలని శుభాకాంక్షలు !!!
నాకు, నా లాంటి తెలుగు వాళ్ళందరికీ ఇది నిజంగా ఒక పండుగే !
ఒక రకంగా ఇది తెలుగు హ్యాట్రిక్ డే !
ఉదయం అన్ని ఛానెల్స్ లోనూ పంచాంగ శ్రవణం అయ్యేక..మొదలయ్యింది అసలు సిసలు తెలుగు పండుగ !
శ్రీ వెంకటేశ్వరా , ఇంకా భక్తి చానల్స్ లో అవధానాల పరంపరతో .. ఒక చోట శ్రీ మేడసాని మోహన్ , మరో రెండు చోట్ల శ్రీ గరికపాటి ...
ఈ రోజు అతిరథ నాయకుడు గా శ్రీ గరికపాటి నరసింహా రావు గారిని చెప్పుకోవచ్చు .
ఉగాది నాడు ఎలా వుంటే సంవత్సరం అంతా అలా వుంటుంది అన్న నమ్మకం నిజమైతే, ఇక ఈ సంవత్సరం అంతా సాహిత్య సౌరభాల వెల్లువ వస్తుందని ఆ జడి వానలో మనందరం తడిసి ముద్దవుతామని, ఆ ప్రకారం శ్రీఖరం సాహితీ శ్రీకరం అవుతుందనీ ఆశిద్దాము !
ఇవ్వాళ వుట్టి మీంచి పడిన తెలుగుతనం మరింతగా పదునెక్కి మన మనసుల్ని రంజింప చేస్తుందని తలుద్దాము !!
మరొక్క సారి మీకందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ..
(అష్ట్తవధానం విశేషాలు,పూరణలు రేపటి మాట లో ...)
మీ,
- మూర్తి రేమిళ్ళ
No comments:
Post a Comment